logo

Hyderabad: ముగిసిన ఎమ్మెల్యే సత్యం భార్య అంత్యక్రియలు

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Published : 21 Jun 2024 15:47 IST

అల్వాల్‌: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గురువారం అర్ధరాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య కారణాలవల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు తల్లి భూలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన సమయంలో భూలక్ష్మితో పాటు కుమారుడు యోజిత (11), కుమార్తె రిషిక(9) ఇంట్లోనే ఉన్నారు. 12  సంవత్సరాల క్రితం సత్యం రూపదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రూపా దేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఘటనకు ముందు మూడు రోజులుగా స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అర్ధరాత్రి భర్తతో మాట్లాడిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని