logo

Drones: డ్రోన్‌తో ట్రాఫిక్‌ పర్యవేక్షించి.. నియంత్రించి

ఫైనాన్షియల్‌ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది.

Updated : 15 Jun 2024 08:37 IST

నిఘా నేత్రం తీసిన చిత్రం

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఫైనాన్షియల్‌ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ జాంపై డ్రోన్‌ నేత్రంతో దృశ్యాలను వీక్షించి సిబ్బంది వెంటనే చేరుకుని నియంత్రించడమే దీని ఉద్దేశం. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) భాగస్వామ్యంతో సైబరాబాద్‌ పోలీసులు ‘థర్డ్‌ ఐ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ డ్రోన్‌ కేపబిలిటీ’ పేరుతో ట్రాఫిక్‌ డ్రోన్‌ నిఘా నేత్రాన్ని శుక్రవారం ప్రవేశపెట్టారు. దాన్ని ఐటీ క్షేత్రాలు, ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాల్లో విజయవంతంగా పరిశీలించారు. ఈ మానవ రహిత వైమానిక నిఘా వాహనం(యూఏఎస్‌వీ-అన్‌మ్యాన్డ్‌ సర్వైలెన్సు వెహికిల్‌)ను నిర్దిష్ట ప్రదేశం నుంచి రిమోట్‌ సహాయంతో నియంత్రిస్తారు.

ట్రాఫిక్‌ డ్రోన్‌తో పోలీసులు..

ఉదయం.. సాయంత్రం రద్దీ వేళల్లో.. మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ, కొండాపూర్, కూకట్‌పల్లి, ఇటు నానక్‌రాంగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో ఐటీ సంస్థల కార్యాలయాలు ప్రారంభమయ్యే ఉదయం, సాయంత్రం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయాల్లో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంటోంది. సిబ్బంది వెళ్లి నియంత్రించే వరకు వాహదారులు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కీలక ప్రాంతాలపై ఈ యూఏఎస్‌వీతో నిఘా వేస్తారు. సమస్య తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మరింత మంది సిబ్బందిని నియమించి ట్రాఫిక్‌ జాంను అరికడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని