logo

Ramoji Rao: రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో రామోజీరావుకు నివాళులు

రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు మృతికి ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు.

Updated : 12 Jun 2024 13:58 IST

అబ్దుల్లాపూర్ మెట్: రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు మృతికి ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. పాఠశాల ప్రారంభం రోజు ప్రత్యేక కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి రామోజీరావుకు అంజలి ఘటించారు. ‘మహాప్రస్థానం.. మరో ప్రపంచ నిర్మాణం.. మీ తోనే.. మీ తోనే..’ అనే గీతాన్ని పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు సింహ రచించి స్వర కల్పన చేసి గీతమాలపించి రామోజీరావు ఆత్మశాంతికి ప్రార్థించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా మాట్లాడుతూ.. రామోజీరావు ఆయా రంగాల్లో అందించిన సేవలను, సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని