logo

Karimnagar: పారిశుద్ధ్య కార్మికుడు మృతి

ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎల్తూరి సత్తయ్య (52) ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

Published : 13 Jun 2024 16:32 IST

ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఎల్తూరి సత్తయ్య (52) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నంది మేడారంలోని పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకు వద్ద పిచ్చి మొక్కలను తొలగిస్తున్న క్రమంలో ట్యాంకు పై నుంచి బ్యాంకులో నీటిమట్టం వివరాలు సూచించే ఇనుప బోర్డు సత్తయ్యపై పడింది. మెడపై పడడంతో కుప్పకూలిపోయాడు. మిగతా సిబ్బంది కలిసి సత్తయ్యను 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్తయ్య మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని