logo

గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా

గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 18 May 2024 05:58 IST

 మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల, న్యూస్‌టుడే: గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేశానని గెలిస్తే అర్జునుడిని అవుతా, ఓడితే అభిమన్యుడిని అవుతానని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే నిజామాబాద్‌ నుంచి పోటీ చేశానని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకునేందుకు భారాస భాజపాకు అమ్ముడుపోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేక భారాస దీక్షలు చేస్తుందన్నారు. భాజపా కేవలం మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడం మినహా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు, బోనస్‌, ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదన్నారు. గిరినాగభూషణం, బండ శంకర్‌, జున్ను రాజేందర్‌, కండ్లపల్లి దుర్గయ్య తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని