logo

అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

జిల్లాలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

Published : 13 Jun 2024 04:27 IST

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా నూతన పోలీస్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన టెన్నిస్‌ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి టెన్నిస్‌ కోర్టును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది వారి పిల్లల కోసం ఫ్లడ్‌ లైట్స్‌ వెలుగులతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అత్యాధునిక టెన్నిస్‌ కోర్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు. పోలీసులు ఇదే స్ఫూర్తిని వృత్తిలోనూ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేశ్, సీఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని