logo

శిథిల భవనంతో భయం

28 సంవత్సరాల క్రితం నిర్మించిన మంథని సామాజిక వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకొంది. స్లాబ్‌ పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో రోగులు ఆసుపత్రిలో ఉండటానికి జంకుతున్నారు.

Published : 13 Jun 2024 04:30 IST

సామాజిక ఆసుపత్రి దుస్థితి మారేదెన్నడో!
న్యూస్‌టుడే, మంథని 

28 సంవత్సరాల క్రితం నిర్మించిన మంథని సామాజిక వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకొంది. స్లాబ్‌ పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో రోగులు ఆసుపత్రిలో ఉండటానికి జంకుతున్నారు. ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి 2018లో రూ.2.76 కోట్లు డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరయ్యాయి. 2019లో టెండరు ప్రకియ సైతం పూర్తయింది. ప్రస్తుతం నడుస్తున్న ఆసుపత్రి మరో చోటుకి తరలించడానికి అనువైన భవనం అందుబాటులో లేక తరలించలేదు. ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆసుపత్రిని తరలించేందుకు అనువైన భవనం అందుబాటులోకి లేకపోవడంతో నూతన భవనాల నిర్మాణ పనులను 2022లో డీఎంఎఫ్‌టీ కమిటీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మంథనిలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నూతన భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంథనిలో 50 పడకల ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆరు నెలలు గడిచినా ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. ఈ విషయమై జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణాధికారి రమాకాంత్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మంథనిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని