logo

తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు సినారె

తెలుగు సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కొనియాడారు.

Published : 13 Jun 2024 04:42 IST

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కొనియాడారు. బుధవారం వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేటలోని కవితా కర్పూర క్షేత్రంలో నిర్వహించిన సినారె వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఆయన స్మృతి స్థలిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కవిగా, రచయితగా, గేయ కావ్య కృతికర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీత రచయితగా తనదైనశైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలకిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడని పేర్కొన్నారు. ఆయన మన ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు చాలా గర్వ కారణమన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్‌ బండ్‌పై ప్రతిమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి సంకశాల మల్లేశం మాట్లాడుతూ హన్మాజీపేటలో జన్మించిన తాను బాల్యం నుంచి సినారె స్ఫూర్తితో పైకి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినారె ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, ఎంపీటీసీ సభ్యురాలు శ్యామల, మాజీ సర్పంచి జంకె విజయ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, కాంగ్రెస్‌ నాయకులు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని