logo

ఒక విద్యార్థిని.. నలుగురు ఉపాధ్యాయులు

విద్యాసంవత్సరం పునఃప్రారంభం రోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల  హాజరు శాతం బాగా తగ్గింది. జమ్మికుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు బుధవారం కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే హాజరయింది.

Published : 13 Jun 2024 04:43 IST

న్యూస్‌టుడే, జమ్మికుంట : విద్యాసంవత్సరం పునఃప్రారంభం రోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల  హాజరు శాతం బాగా తగ్గింది. జమ్మికుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు బుధవారం కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే హాజరయింది. నలుగురు ఉపాధ్యాయులు విధులకు వచ్చారు. వేసవి సెలవుల అనంతరం మొదటి రోజు కావటం, బోనాల వేడుకలు తదితర కారణాలతో విద్యార్థులు ఎవరు హాజరు కాలేదని ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఎంఈవో వి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని