logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

గల్ఫ్‌ దేశం వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న యువకులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు బలిగొన్న సంఘటన  గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.

Published : 13 Jun 2024 04:49 IST

గంభీరావుపేట, న్యూస్‌టుడే: గల్ఫ్‌ దేశం వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న యువకులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు బలిగొన్న సంఘటన  గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై రామ్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్లా (32), సయ్యద్‌ చాంద్‌ (38)లు గల్ఫ్‌ వెళ్లడానికి వీసా కోసం వేములవాడలో ఇంటర్వ్యూలు ఉన్నాయని తెలియడంతో బుధవారం ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సయ్యద్‌ చందా, సయ్యద్‌ పైరా మరో ద్విచక్రవాహనంపై బయలు దేరారు. పెద్దమ్మ బస్టాప్‌ దాటి మూలమలుపు వద్దకు వెళ్లగానే షేక్‌ అబ్దుల్లా ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన షేక్‌ అబ్దుల్లా, సయ్యద్‌ చాంద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ దివాకర్‌ పరారయ్యాడు. వెనుక వస్తున్న పైరా, చందాలు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడి చేరుకుని మృతదేహాలను శవ      పరీక్ష కోసం సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మృతి చెందారని షేక్‌ అబ్దుల్లా భార్య షేక్‌ జయిరాంబి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా, చాంద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని