logo

కొందరికే అంతర్గత చలనం!

కరీంనగర్‌ నగరపాలిక కార్యాలయంలోని పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు బుధవారం అంతర్గత బదిలీలు చేస్తూ నగరపాలిక కమిషనర్‌ కార్యాలయ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 13 Jun 2024 04:50 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరపాలిక కార్యాలయంలోని పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు బుధవారం అంతర్గత బదిలీలు చేస్తూ నగరపాలిక కమిషనర్‌ కార్యాలయ ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియాలో మొత్తం 29 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు పని చేస్తున్నారు. వీరిలో కొందరు మేయర్, అదనపు కలెక్టర్, కమిషనర్‌ సీసీలుగా పని చేస్తున్నారు. మిగతా వారంతా విభాగాల్లోని సెక్షన్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నారని, వీరందరినీ మార్చాలని ఇటీవల పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి విభాగాలను మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకోగా.. కొందరిని అలాగే కొనసాగించడం విమర్శలకు తావిచ్చింది. ప్రధాన విభాగాల్లో ఉండగా ఇంకా ఏడుగురు కంప్యూటర్‌ ఆపరేటర్ల సీట్లు మార్చకపోవడంపై మిగతా కంప్యూటర్‌ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. రాజకీయ పైరవీలు, అధికారులకు సన్నిహితంగా ఉండే వారిని అంతర్గత బదిలీ చేయలేదని ఆగ్రహిస్తున్నారు. స్థానచలనం చేస్తే మొత్తం ఆపరేటర్లను చేయాలని పలువురు కార్పొరేటర్లు కోరుతున్నారు. లేదంటే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని