logo

అరకొర వసతులు.. మొక్కుబడి పరీక్షలు

ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల రిజిస్ట్రేషన్లతో యూనిట్‌ కార్యాలయం నుంచి ఆర్టీవో స్థాయికి ఉన్నతి పొందిన పెద్దపల్లి రవాణా శాఖ అద్దె భవనంలో అరకొర వసతులతోనే కాలం వెళ్లదీస్తోంది.

Published : 17 Jun 2024 03:05 IST

సొంత భవనం లేక రవాణా శాఖకు తప్పని ఇక్కట్లు
న్యూస్‌టుడే, పెద్దపల్లి 

మ్మడి రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల రిజిస్ట్రేషన్లతో యూనిట్‌ కార్యాలయం నుంచి ఆర్టీవో స్థాయికి ఉన్నతి పొందిన పెద్దపల్లి రవాణా శాఖ అద్దె భవనంలో అరకొర వసతులతోనే కాలం వెళ్లదీస్తోంది. 2014లోనే ప్రాంతీయ రవాణా కార్యాలయంతో పాటు సొంత భవనం, రవాణా ట్రాక్‌ కోసం ఎస్సారెస్పీ క్యాంపులో 4 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ అదే ఏడాది రాష్ట్ర విభజన జరగటంతో ప్రక్రియ నిలిచిపోయింది. 2016లో ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆర్టీవో కార్యాలయం ప్రక్రియ నిలిచిపోయింది. అన్ని జిల్లా కేంద్రాలలో డీటీవో స్థాయి అధికారితో రవాణా శాఖ నిర్మితమైంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రవాణా కార్యాలయం కోసం మరోసారి స్థలాన్వేషణ చేపట్టారు. ఒకసారి రాఘవపూర్‌లోని గుట్టబోరు ప్రాంతం, మరోసారి అందుగులపల్లి సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. రాఘవపూర్‌లోని స్థలం కేటాయింపులో స్పష్టత లేకపోవడం, అందుగులపల్లిలోని స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించటంతో మరోసారి రవాణా శాఖకు నిరాశే ఎదురైంది. డీటీవో కార్యాలయాన్ని గతంలో యూనిట్‌ కార్యాలయం నిర్వహించిన ఇరుకైన అద్దె భవనంలో ఏర్పాటు చేసి, అక్కడి సమీపంలోనే ఒక తాత్కాలిక షెడ్డు నిర్మించి, అందులో యూనిట్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇక వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు ట్రాక్‌ లేకపోవడంతో మొక్కుబడి తంతుగా ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. దీనిపై జిల్లా రవాణాధికారి రంగారావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా స్థలం సమస్యపై ఎమ్మెల్యేతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని