logo

భార్య జ్ఞాపకం.. గుడితో పదిలం

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలు గుర్తుండేలా గుడి నిర్మించాడు ఓ భర్త.. నిత్యం ఆ గుడిలో దీపం వెలిగించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.

Updated : 17 Jun 2024 05:53 IST

మల్యాల, న్యూస్‌టుడే: భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలు గుర్తుండేలా గుడి నిర్మించాడు ఓ భర్త.. నిత్యం ఆ గుడిలో దీపం వెలిగించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తడగొండ దుబ్బయ్యకు ముత్యంపేట గ్రామానికి చెందిన బుచ్చమ్మ(55)తో చిన్నవయసులోనే వివాహమైంది. దంపతులకు పిల్లలు లేకపోయినా అన్యోన్యంగా ఉండేవారు.

దుబ్బయ్య జీవనోపాధి నిమిత్తం గతంలో దుబాయి వెళ్లి వచ్చి మ్యాడంపల్లిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 2023 ఫిబ్రవరి 6న బుచ్చమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని దుబ్బయ్య తన మామిడితోటలో ఆమెకు గుడి కట్టాడు. ఒక గదిలో భార్య చిత్రాలను ఏర్పాటు చేశాడు. నిత్యం వచ్చి దీపం వెలిగించి భార్య జ్ఞాపకాలను స్మరించుకుంటూ వెళ్తుంటానని దుబ్బయ్య తెలిపారు. విద్యుత్తు కోసం సౌర పరికరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని