logo

వరద వస్తే రాకపోకలు బంద్‌

వంతెన నిర్మాణం పూర్తి శ్రీ అప్రోచ్‌ రోడ్డుకు భూసేకరణలో జాప్యంన్యూస్‌టుడే, రామడుగుదశాబ్దాలుగా ప్రమాదాలు చోటుచేసుకున్న రామడుగులోని ‘మలుపుల’ వంతెనకు గ్రహణం వీడటంలేదు.

Published : 18 Jun 2024 06:23 IST

వంతెన నిర్మాణం పూర్తి

శ్రీ అప్రోచ్‌ రోడ్డుకు భూసేకరణలో జాప్యంన్యూస్‌టుడే, రామడుగు

దశాబ్దాలుగా ప్రమాదాలు చోటుచేసుకున్న రామడుగులోని ‘మలుపుల’ వంతెనకు గ్రహణం వీడటంలేదు. మోతెవాగుపైన పాత వంతెన శిథిలం కావడంతో రూ.7.9 కోట్లతో ఆరేళ్ల కిందట కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికి తీవ్ర జాప్యం కావడంతో ప్రమాదకర శిథిల వంతెనపై నుంచే వాహనాలు వెళ్తున్నాయి. రామడుగు, పెగడపల్లి, గొల్లపల్లి మండలాలకు ఈ మార్గం గుండా సుమారు 50 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వానాకాలంలో వర్షాలకు మట్టి కొట్టుకుపోయి రవాణా నిలిచిపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారంపాటు వెళ్లలేకపోతారు. చిరువ్యాపారులు, రైతులు కరీంనగర్‌కు వివిధ అవసరాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడతారు. కొత్త వంతెనను ప్రమాదకర మలుపులు లేకుండా నిర్మించారు. దీనికి రెండు వైపులా కొంత భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఎకరం 33 గుంటల స్థలాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. పరిహారం కింద రూ.1.80 కోటి చెల్లించాల్సి ఉండటంతో పలుమార్లు పునర్విచారణ జరిపారు. కానీ పరిహారం చెల్లించకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది. రెండేళ్ల కిందట వంతెన నిర్మాణం పనులు పూర్తి చేసినా ఇరువైపులా భూసేకరణ పూర్తికాక కొత్త వంతెన ప్రారంభించడంలేదు. మళ్లీ వర్షాకాలం రావడంతో మూడు మండలాల ప్రజలు పాత వంతెనపై రాకపోకలు నిలిచిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాత వంతెన రక్షణ గోడ లేక, అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహన చోదకులకు అగ్ని పరీక్షగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, స్థల సేకరణ జరిపి.. కొత్త వంతెనను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని