logo

నులిమేస్తుంది.. జాగ్రత్త

ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం అల్బెండజోల్‌ మాత్రలు గురువారం వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

Published : 20 Jun 2024 02:52 IST

నేడు 3.47 లక్షల మంది పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

డాది వయసు నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం అల్బెండజోల్‌ మాత్రలు గురువారం వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఏటా జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లావ్యాప్తంగా 1-19 ఏళ్ల లోపు 3.47 లక్షల మంది ఉండగా వారందరి కోసం అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు ఈ నెల 19న మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

నులి పురుగులతో జరిగే నష్టం

  • రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గించడం.
  • నులిపురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  • వీటి సంక్రమణ తక్కువగా ఉన్న పిల్లల్లో వ్యాధుల లక్షణాలు కనిపించవు.

నిర్మూలన వల్ల ప్రయోజనాలు

రక్తహీనత నియంత్రిస్తుంది. పోషకాహారం మెరుగు పడుతుంది. పని సామర్థ్యం, ఆకలి పెరుగుతుంది. కడుపు నొప్పి వంటివి ఉండవు. బరువు పెరుగుతారు.

తీసుకోవాల్సిన చర్యలు

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు షూలు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదు. చేతులు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు శుభ్రమైన నీటితో కడగాలి.

వ్యాప్తికి కారణం

తక్కువ సామర్థ్యం అపరిశుభ్రత ఉన్న ప్రాంతాలలో మానవ మలం ఉన్న గుడ్ల ద్వారా మట్టి కలుషితమై మట్టి ద్వారా వ్యాప్తి చెందే అవకాశముంది. పిల్లలు మట్టిలో ఆడుకొని కలుషితమైన మట్టి చేతులను నోటిలో పెట్టుకుంటే వ్యాప్తి చెందుతుంది. పిల్లల్లో ఈ వ్యాప్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. నులి పురుగులలో ప్రధానమైన జాతుల్లో నట్టలు, ఏలిక పాములు, నులిపురుగులు, కొంక పురుగులు వంటివి ఉంటాయి.


తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి

- సుజాత, డీఎంహెచ్‌వో, కరీంనగర్‌

నులి పురుగుల మాత్రలు వేయించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలలో చెప్పి వేయించాలి. ఈ నెల 20న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాత్రలు వేయని వారికి ఈనెల 27 వేయడం జరుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని