logo

రాజన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి ఆలయానికి చేరుకోగానే జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా,

Published : 20 Jun 2024 02:59 IST

వేములవాడ, న్యూస్‌టుడే : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి ఆలయానికి చేరుకోగానే జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ అఖిల్‌ మహాజన్, అదనపు కలెక్టర్లు గౌతమి, ఖీమ్యానాయక్, ఆలయ ఇన్‌ఛార్జి ఈవో రామకృష్ణ, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి స్వామివారి దర్శనానికి వెళ్లగా మేళతాళాలతో ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ధ్వజ స్తంభానికి మొక్కుకున్న అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, భాజపా రాష్ట్ర నాయకులు మహేశ్, శంకర్, రమేశ్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు సంతోష్‌బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మార్కండేయ దేవాలయంలో.. 

సిరిసిల్ల(విద్యానగర్‌): సిరిసిల్లలోని శ్రీ శివ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రిగా సిరిసిల్లకు మొదటిసారి విచ్చేసిన బండి సంజయ్‌కు భాజపా నాయకులు, పద్మశాలీ సంఘం నాయకులు, ప్రజలు సిరిసిల్లలోని మార్కండేయ కమాన్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మార్కండేయ దేవాలయంలోని గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం పద్మశాలీ సంఘం నాయకులు, వస్త్రోత్పత్తి సంఘాల నాయకులు మార్కండేయుడి చిత్రంతో రూపొందించిన బుల్లి మరమగ్గం ఉన్న జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమరెడ్డి, సిరిసిల్ల పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్, వెంకటరమణ, సత్యం, దామోదర్, రవి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని