logo

మైనర్లకు వాహనాలు ఇవ్వటం చట్టరీత్యా నేరం

మైనర్లకు వాహనాలు ఇవ్వటం, వారిని నడపమని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

Published : 20 Jun 2024 03:00 IST

స్పెషల్‌ డ్రైవ్‌లో 361 వాహనాలు సీజ్‌

సిరిసిల్లగ్రామీణం, న్యూస్‌టుడే : మైనర్లకు వాహనాలు ఇవ్వటం, వారిని నడపమని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు బుధవారం సిరిసిల్ల పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్‌ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్‌ నిబంధనలపై జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీ ఎడ్యుకేషన్‌ తరగతులు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 361 వాహనాలను సీజ్‌ చేశామని ఎస్పీ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు సదన్‌కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని