logo

ఉమ్మడి జిల్లాకు తిరిగొస్తున్న డీసీసీబీ అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌ స్థాయి నుంచి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు గల అధికారులను బదిలీ చేయాలని టెస్కాబ్‌ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది.

Published : 20 Jun 2024 03:10 IST

24కల్లా విధుల్లోకి..  
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

రాష్ట్రవ్యాప్తంగా సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌ స్థాయి నుంచి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు గల అధికారులను బదిలీ చేయాలని టెస్కాబ్‌ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. ఆ క్రమంలోనే మొదట ఏజీఎం నుంచి డీజీఎం హోదా వరకు గల ఇతర జిల్లాలో పని చేస్తున్న 68 మందిని ఒకేసారి బదిలీలు చేశారు. రెండున్నరేళ్ల క్రితం సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు అప్పటి పాలకవర్గం నిర్ణయం మేరకు బదిలీలు చేశారు. అందులో భాగంగానే కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఇతర జిల్లాల నుంచి బదిలీ అయి పనిచేస్తున్న 8 మందిని వారి సొంత జిల్లాలకు.. ఆయా జిల్లాలో పని చేస్తున్న 8 మందిని ఉమ్మడి జిల్లాకు బదిలీ చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో..

గత ప్రభుత్వ హయాంలో టెస్కాబ్‌ కామన్‌ పూల్‌ విధానాన్ని అమలు చేసింది. దీని ప్రకారం సొంత జిల్లాల్లో ఉన్న జీఎం నుంచి ఏజీఎం వరకు గల అధికారులను ఇతర జిల్లాలకు ఇతర జిల్లాల వారిని ఇక్కడికి పంపించారు. ఈ విధానంపై కొంత అసంతృప్తి వ్యక్తం అయినా ఆ విధానాన్ని కొనసాగించింది. కాగా ఈ విధానాన్ని మార్చి ఎక్కడి వారిని అక్కడికి పంపించాలన్న అభ్యర్థన మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా టెస్కాబ్‌ కొత్త ఛైర్మన్‌ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ క్రమంలోనే బదిలీలు జరిగాయి. కొత్తగా బదిలీ అయి వస్తున్న వారు వెళ్లినవారు ఈ నెల 24న రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక అధికారి జిల్లా బ్యాంకులో రిపోర్టు చేసినట్లు సమాచారం. జీఎంల బదిలీలు కూడా నెలాఖరు వరకు జరుగుతాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. బదిలీలు జరిగిన మాట వాస్తవమేనని బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు తెలిపారు. 

బదిలీలు ఇలా.. 

  • తర జిల్లాలకు బదిలీ అయిన ఏజీఎంలు అయిదుగురు.
  • వరంగల్, ఆదిలాబాద్, మెదక్, నిజమాబాద్‌ జిల్లాల నుంచి జిల్లాకు రావాల్సిన వారు అయిదుగురు.
  • ఇతర జిల్లాలకు బదిలీ అయిన డీజీఎంలు ముగ్గురు.
  • నిజమాబాద్, వరంగల్, హైదరాబాద్‌ నుంచి జిల్లాకు రావాల్సిన వారు ముగ్గురు.
  • ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఈ జిల్లాకు చెందిన జీఎంలు ఇద్దరు (వీరికి బదిలీ కావాల్సి ఉంది).  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు