logo

సుల్తానాబాద్‌ ఠాణా సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్లలో బుధవారం వ్యవసాయ బావిలో పడి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే.

Published : 21 Jun 2024 05:14 IST

సోదరి మృతి ఘటనలో అన్యాయం జరిగిందని ఆరోపణ

సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో బాపురావు

సుల్తానాబాద్, న్యూస్‌టుడే: సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్లలో బుధవారం వ్యవసాయ బావిలో పడి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. కాగా తన చెల్లి మృతికి కారణం తన బావ కుటుంబమేనని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ మృతురాలు నిర్మల సోదరుడు ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌కు చెందిన బాపురావు గురువారం ఠాణా సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అంతకుముందు మాట్లాడుతూ తన చెల్లెలి మృతిపై తమకు అనుమానాలున్నాయని, ఆమె మృతి చెంది రెండు రోజులు గడుస్తున్నా శవ పరీక్షలు చేయలేదని, దీంతో మృతదేహం కుళ్లిపోయే స్థితిలో ఉందని వాపోయాడు. తమకు న్యాయం చేయడం లేదంటూ పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు, పోలీసులు పోలీసు వాహనంలోనే సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎస్సై శ్రావణ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మహిళ మృతిపై బాధితులు ఫిర్యాదు చేయడంలో జాప్యం వల్లే శవ పరీక్షలు ఆలస్యమయ్యాయన్నారు. గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని, శుక్రవారం శవ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని