logo

ఉత్పత్తుల ధరల పెంపు

కేంద్రప్రభుత్వం పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)ను పెంచగా ప్రభుత్వరంగ సంస్థల సేకరణ, ప్రైవేటుగా ధరల అమలుతోనే అన్నదాతలకు ప్రయోజనం కలగనుంది.

Published : 21 Jun 2024 05:24 IST

ప్రభుత్వ సేకరణతోనే రైతులకు గిట్టుబాటు
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

పెంచిన ధరలిలా (క్వింటాలుకు రూ.లలో...)

కేంద్రప్రభుత్వం పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)ను పెంచగా ప్రభుత్వరంగ సంస్థల సేకరణ, ప్రైవేటుగా ధరల అమలుతోనే అన్నదాతలకు ప్రయోజనం కలగనుంది. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల విస్తీర్ణంతో వరి ప్రధాన పంటగా ఉండగా ప్రభుత్వం ఇన్నాళ్లూ ధాన్యం దొడ్డుగింజ రకాలను కొనుగోలు చేస్తుండగా వచ్చే సీజన్‌లో రూ.500 బోనస్‌తో సన్నగింజ రకాలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కేంద్రం ధరపెంపు, రాష్ట్రప్రభుత్వ బోనస్‌ను కలుపుకొంటే జిల్లాలోని సాగు అంచనా, సరాసరి దిగుబడిని బట్టి దాదాపుగా రూ.360 కోట్లవరకు రైతులకు అదనపు ప్రయోజనం కలగనుంది.

  •  ఉమ్మడి జిల్లాలో వరి తదుపరి పత్తి రెండో అత్యధిక విస్తీర్ణంలో 1.88 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. పత్తిలో సీసీఐ ద్వారా కేవలం 2-18 శాతం పంటనే కొనుగోలు చేస్తుండగా మిగిలిన దూదిని రైతులు మార్కెట్లు, గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో దూదికి ధర తగ్గితే సీసీఐ సేకరణ కేంద్రాల సంఖ్యను పెంచాల్సి ఉంది. కేంద్రం కోటా ఇవ్వలేదనే కారణంతో కందులను అత్యంత పరిమితంగానే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తుండటంతో రైతులందరికీ మద్దతుధర దక్కటంలేదు. మక్కలకు బయటి మార్కెట్లో ధర తగ్గితే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనాల్సి ఉంటుంది. వేరుసెనగ, సెనగలు, మినుములు, పెసలు, సోయాబీన్‌ తదితర ఉత్పత్తుల సేకరణనూ చేపట్టాల్సి ఉంటుంది.
  •  పసుపు పంటకు ఈ సీజన్‌లోనూ మద్దతు ధర ప్రకటించనందున విపణి ధరపైనే రైతులు ఆధారపడాల్సి ఉంటుంది. పదేళ్ల తరువాత ఇటీవల పసుపు పంటకు మంచి ధర లభించగా మున్ముందు ధర తగ్గితే పసుపును కూడా గతంలో మాదిరిగా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనాలని, గిట్టుబాటుగాని పంటలకు రాష్ట్రప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వరికి క్వింటాలుకు రూ.117, మక్కలు రూ.135, పెసర రూ.124, పత్తి రూ.501 చొప్పున ధర పెంచగా విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల ధరలు, కూలీలు, యంత్రాల ధరలు భారీగా పెరగటంతో పంటలకు పెంచిన ధరలు అంతగా లాభం కలిగించేలాలేవు. దీనికిగాను మార్కెట్‌లో మద్దతు కన్నా ధర తగ్గినపుడు ప్రభుత్వం మార్కెట్‌జోక్య పథకం ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధరలతో కనీస మొత్తం చేతికంది ఆర్థిక ఆసరా కలుగుతుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు