logo

మీ ఆశయాల స్ఫూర్తితో సాగుతాం

అక్షర యోధుడు రామోజీరావుకు ‘ఈనాడు’ కరీంనగర్‌ యూనిట్‌ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

Published : 21 Jun 2024 05:57 IST

రామోజీరావుకు గ్రూప్‌ సంస్థల ఉద్యోగుల ఘన నివాళి
ఈనాడు, కరీంనగర్‌

కరీంనగర్‌ ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటం
వద్ద మౌనం పాటిస్తున్న యూనిట్‌ సారథి యుగంధర్‌రెడ్డి, ఉద్యోగులు

అక్షర యోధుడు రామోజీరావుకు ‘ఈనాడు’ కరీంనగర్‌ యూనిట్‌ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. గురువారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో మొదట ‘ఈనాడు’ కరీంనగర్‌ యూనిట్‌ సారథి యుగంధర్‌రెడ్డితోపాటు సిబ్బంది రామోజీరావు చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి నిమిషం పాటు మౌనం పాటించారు. క్రమశిక్షణ, సమయపాలన, కష్టించే తత్వం తమకు ఛైర్మన్‌ నేర్పారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్‌ నగర మేయర్‌ సునీల్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.ఎన్‌.రావులు రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించారు.


నివాళులర్పిస్తున్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్‌రావు, కాంగ్రెస్‌
నగరాధ్యక్షడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు

మార్గదర్శి కార్యాలయాల్లో ..

ఉమ్మడి జిల్లాలోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయాల్లో సిబ్బంది, ఏజెంట్లు రామోజీరావుకు ఘనంగా నివాళి అర్పించారు. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మేనేజర్లు సురేశ్‌బాబు, ఉమాపతి, రజనీకాంత్, సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు.

కరీంనగర్‌ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయంలో..

సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ గ్రూప్‌ సిబ్బంది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని