logo

పోడు భూమిలో అటవీ పనులు.. గ్రామస్థుల ఆందోళన

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం శివారులోని పోడు భూమిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు.

Published : 23 Jun 2024 04:44 IST

గ్రామస్థులతో మాట్లాడుతున్న అటవీ సెక్షన్‌ అధికారి సకారాంనాయక్‌ 

గుండారం (ఎల్లారెడ్డిపేట), న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం శివారులోని పోడు భూమిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అటవీ సెక్షన్‌ అధికారి సకారాంనాయక్‌ అక్కడికి చేరుకొని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. పోడు భూమి విషయంపై కొంతకాలంగా అటవీశాఖ, గ్రామస్థుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ భూమిని తమకు కేటాయించాలని కోరుతూ 210 మంది గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్‌ అధికారి సకారాంనాయక్‌ మాట్లాడుతూ పోడు భూమిలో నిర్వహిస్తున్న ఈజీఎస్‌ పనులను అడ్డుకోవద్దని.. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించుకోవాలని సూచించారు. పనులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోడు భూమి కమిటీ  ఛైర్మన్‌ బానోతు రాజునాయక్‌ పనులపై పునరాలోచించాలని సెక్షన్‌ అధికారి సకారాంనాయక్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని