logo

సీఎం రైతుల పక్షపాతి

సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతి అని శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 23 Jun 2024 04:58 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, చిత్రంలో విప్‌ లక్ష్మణ్‌కుమార్‌ 

జగిత్యాల, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతి అని శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు ఏకకాలంలో ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని ఇందుకోసం రూ.31 వేల కోట్లు కేటాయించారని అన్నారు. రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు నిర్వహించాలన్నారు. పురపాలక మాజీ ఛైర్మన్‌ గిరినాగభూషణం, బీర్పూర్‌ ఎంపీపీ మాసర్తి రమేష్, బండశంకర్, గాజంగి నందయ్య, ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని