logo

Bangalore: సిలికాన్‌సిటీ మహా విస్తరణ

రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది. అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటైన ఉద్యాననగరిని మరింత ఉన్నతంగా విస్తరించేందుకు ‘బ్రాడ్‌ బెంగళూరు’ పథకం కింద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Updated : 27 Aug 2023 09:57 IST

రానున్న తరాలకు మౌలిక వసతుల కల్పనే కీలకం

రాజధాని నలుచెరుగులా పొడవైన ఉపరితల వంతెనలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది. అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటైన ఉద్యాననగరిని మరింత ఉన్నతంగా విస్తరించేందుకు ‘బ్రాడ్‌ బెంగళూరు’ పథకం కింద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సమీక్షలో ఈ సురక్షితనగరి విస్తరణ- పర్యావరణ పరిరక్షణ అంశాలు విడదీయలేనివి. అత్యున్నత నిర్మాణ విలువలతో నగరాన్ని విస్తరించే అంశంపై బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె 70 వేల సలహాలు, సూచనలు ప్రస్తుతం స్వీకరించి, సమీక్షిస్తోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల విస్తరణ తక్షణ చర్యగా గుర్తించారు. అత్యధికుల సూచనల్లో ఈ అంశం ప్రముఖంగా కనిపించిందని నగరాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన.అమెరికా వాణిజ్య- వ్యాపార సంస్థ సమావేశంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బెంగళూరు ప్రాముఖ్యతను సుదీర్ఘంగా వివరించారు. విస్తరణ వివరాలను రేఖామాత్రంగా విశ్లేషించారు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా, కొత్త ప్రయోగాలకు కేంద్రంగా, త్వరగా ఉపాధి అందించే వేదికగా నగరాన్ని అందరూ ఎంచుకుంటారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలు, వివిధ పరిశోధన కేంద్రాలు, అంకుర వేదికలు, ఉత్తమ రవాణా వ్యవస్థ, ఆహ్లాదకరమైన వాతావరణం, తాగునీటి వ్యవస్థ, మేలైన పోలీసు వ్యవస్థ, ఐటీ- బీటీ రాజధానిగా గుర్తింపు వల్ల నగరం వైపు అన్ని వర్గాల వారూ చూస్తున్నారు. రానున్న రెండు మూడు దశాబ్దాలలో జనజీవనానికి అవసరమైన సదుపాయాల కల్పనకు అంతరార్జతీయ ప్రమాణాలను పాటించక తప్పని వాతావరణం తలెత్తింది.

  • అంకుర సంస్థల రాజధానిగా బెంగళూరు గుర్తింపు పొందింది. వీటి ఏర్పాటులో బెంగళూరు- దిల్లీ మధ్య తొలి నుంచి పోటీ నెలకొంది. అంకురాలను రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తున్న క్రమంలో అనేక మంది నగరానికి కదలి వస్తున్నారు. నవతరం ఆలోచనల కేంద్రంగా గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తోంది. ఇస్రో, హెచ్‌ఏఎల్‌, భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) తదితరాల్లో ఆధునిక ప్రయోగాల కారణంగా శాస్త్ర, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. 1990 నుంచే ఈ తరహా నిపుణుల రాక నగరానికి జోరందుకోగా ఇప్పుడది మరీ ఎక్కువ. దాదాపు రెండొందలకు పైగా పెద్ద ఐటీ కంపెనీల్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కాస్మోపాలిటిన్‌ సిటీగా విస్తరణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా మారింది.అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు జనజీవన రాకపోకలకు ఎంతో ఉపకరిస్తున్న మెట్రో సంచార వ్యవస్థను అన్ని దిక్కుల్లో అందుబాటులోకి తెస్తున్నారు. రెండు దశాబ్దాల కిందట 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నగరం ప్రస్తుతం 12 వందల చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించగా.. మరో పదేళ్లలో ఈ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల రాకపోకల కోసం మెట్రోతో పాటు సబర్బన్‌ రైలు మార్గాలను నిర్మిస్తారు. దొడ్డబళ్లాపుర ,నెలమంగల, హొసకోట, మాగడి, బిడది, ఆనేకల్‌ ప్రాంతాల్లో ఉపనగరాల నిర్మాణానికి గృహ నిర్మాణ మండలి శ్రీకారం చుట్టింది. బ్రాండ్‌ బెంగళూరు నిర్మాణంలో భాగంగా ఉపనగరాలను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రకటించారు. హొసకోట, తుమకూరు, చిక్కబళ్లాపుర, హోసూరు, కనకపుర వరకు మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదన దస్త్రాలూ వేగంగా కదులుతున్నాయి. 

నగర వాతావరణానికి నేటికీ రక్షణ దుర్గాలు.. చెరువులు, వృక్షాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని