logo

కాదాడి పాటలు వచ్చేశాయ్‌

అరుణం ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న‘ కాదాడి’ చిత్రంలోని మూడు పాటలు ఇటీవల విడుదల చేశారు. జులైలో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ సినీహీరో శశికుమార్‌ కుమారుడు ఆదిత్య శశికుమార్‌ నటిస్తున్న చిత్రానికి సతీశ్‌ మాలెంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 17 Jun 2024 04:04 IST

కాదాడి చిత్రంలో ఆదిత్య శశికుమార్, లావణ్య సాహుకార్‌

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: అరుణం ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న‘ కాదాడి’ చిత్రంలోని మూడు పాటలు ఇటీవల విడుదల చేశారు. జులైలో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ సినీహీరో శశికుమార్‌ కుమారుడు ఆదిత్య శశికుమార్‌ నటిస్తున్న చిత్రానికి సతీశ్‌ మాలెంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. నూరు పుటిద జీవన, బందు ఏళెయకాగద తదితర పాటకు కృష్ణ సాహిత్యం అందించగా అనన్యభట్‌ గానం చేశారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా సమాజానికి ఏమైనా చేయవచ్చనే కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సాహుకార, చాందిని తమిళరసన్‌ హీరోయిన్‌లుగా పూనాని, రవికాళె, మారిముత్తు, ప్రేమ్‌ మనోహర్, శ్రవణ్‌ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్నారు. గోవా, చిక్కమగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ సాగించారు. 


హిరణ్య చిత్రీకరణ పూర్తి

హిరణ్యలో రాజవర్ధన్, రిహనా

బిచ్చుగత్తి సినిమా ద్వారా శాండిల్‌ వుడ్‌కు పరిచయమైన హీరో రాజవర్ధన్‌ నటిస్తున్న రెండో చిత్రం‘ హిరణ్య’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదలైన ఆ చిత్రం పాటలు అందరిని ఆకట్టుకుంటున్నట్లు దర్శకుడు ప్రవీణ్‌ తెలిపారు. రిహనా, దివ్యా సురేష్, హులి కార్తీక్, అరవిందరావ్, దిలీప్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. 


శీతల్‌ శెట్టి మళ్లీ తెరంగేట్రం

ఫైర్‌ ఫై చిత్రంలో శీతల్‌శెట్టి

కన్నడ చలనచిత్ర రంగంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన శీతల్‌ శెట్టి మళ్లీ ‘ఫైర్‌ ఫై’ చిత్రం ద్వారా నటిస్తున్నారు. చిత్రాన్ని ప్రముఖ సినీహీరో శివరాజ్‌కుమార్‌ కుమార్తె నివేదితా శివకుమార్‌ శ్రీముత్తు సినీ సర్వీసెస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది మహిళ ప్రధానమైన చిత్రమని దర్శకుడు వంశీ తెలిపారు. ఆయన చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. చరణ్‌రాజ్‌ సంగీతం అందిస్తున్నారు.


కోకేన్‌ సిద్ధం

కోకేన్‌ చిత్ర బృందం 

నైజీరియా నుంచి బెంగళూరుకు వచ్చిన కంటైనర్‌కు గోవాకు వెళ్లాలి. హీరో హీరోయిన్‌ తమ తెలివి తేటలతో దాన్ని నాశనం చేసే హాస్యం, థ్రిల్లర్, మాస్, రొమాన్స్‌ కలిగిన చిత్రం‘ కోకేన్‌’ చిత్రం చిత్రీకరణ జోరుగా సాగుతోంది. కొన్ని పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం రష్యాకు వెళ్లనుంది. హీరో ప్రథమ్‌ చిత్రకథ అందించినట్లు దర్శకుడు కౌరవ్‌ వెంకటేశ్‌ తెలిపారు. అరన, అన్వితిశెట్టి, గోకుల్, ముని, సంతు, రవీంద్రనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అభిషేక్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని