logo

కాలభైరవేశ్వరుడి సేవలో కుమార

ఆదిచుంచనగిరిలోని కాలభైరవేశ్వరుడిని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మఠం ఆవరణలోని బాలగంగాధరనాథ స్వామి విగ్రహం వద్ద పూజలు చేసుకున్నారు.

Published : 17 Jun 2024 04:09 IST

కుమారస్వామిని సత్కరిస్తున్న నిర్మలానందనాథ స్వామి 

మండ్య, న్యూస్‌టుడే: ఆదిచుంచనగిరిలోని కాలభైరవేశ్వరుడిని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మఠం ఆవరణలోని బాలగంగాధరనాథ స్వామి విగ్రహం వద్ద పూజలు చేసుకున్నారు. మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి కేంద్ర మంత్రిని సత్కరించారు. వివిధ అంశాలపై మఠాధిపతితో కుమారస్వామి సుదీర్ఘంగా చర్చించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు ఇంధన ధరలను పెంచేసిందని కుమార ఆరోపించారు. గ్యారంటీ పథకాల నిర్వహణలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. గృహ లక్ష్మి పథకం లబ్దిదారులకు ఈ నెల రావలసిన రూ.2 వేలు వారి ఖాతాల్లోకి పడలేదని తనకు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని