logo

రూ.4,200 కోట్ల పెట్టుబడుల రాక

దక్షిణ భారత ఉత్సవంలో రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. శక్తి పథకాన్ని అమలు చేయడంతో కర్ణాటక పర్యాటక కేంద్రాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య 50 శాతం ఎక్కువైందన్నారు.

Published : 17 Jun 2024 04:11 IST

 గోడపత్రికను ప్రదర్శిస్తున్న గహ్లోత్, హెచ్‌కే పాటిల్, లెహర్‌సింగ్, సమాఖ్య ప్రతినిధులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: దక్షిణ భారత ఉత్సవంలో రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. శక్తి పథకాన్ని అమలు చేయడంతో కర్ణాటక పర్యాటక కేంద్రాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య 50 శాతం ఎక్కువైందన్నారు. ప్యాలెస్‌ మైదానంలో నిర్వహిస్తున్న దక్షిణ భారత ఉత్సవం-2024 ముగింపు సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాలను మరింత విస్తృతంగా అభివృద్ధి చేయడానికి విపుల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సాధ్యం కాదన్నారు. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు పర్యాటక కేంద్రాల్లో కావలసిన సదుపాయాలను కల్పించడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ ఉత్సవం సహకరించిందని కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌ చంద్ర లహోటి తెలిపారు. పర్యాటక రంగాన్ని, మౌలిక సదుపాయాలను కల్పించే అంశంలో ఫిక్కీ పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ కొందరు పారిశ్రామికవేత్తలకు ఒప్పంద పత్రాలు అందజేశారు. పర్యాటక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ రామ్‌ ప్రసాద్‌ మనోహర్, సమాఖ్య సభ్యులు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు