logo

అంగన్‌వాడీలకు మంత్రి సంఘీభావం

అంగన్‌వాడీ కార్యకర్తలు సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ హామీనిచ్చారు.

Published : 20 Jun 2024 02:22 IST

స్వతంత్ర ఉద్యానవనంలో ధర్నా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి హెబ్బాళ్కర్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలు సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ హామీనిచ్చారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో బుధవారం బెంగళూరు స్వతంత్ర ఉద్యానవనంలో సీఐటీయూ నేతృత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సంబంధిత మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యలపై అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం నేతలతో సమావేశమై చర్చించి, పరిష్కరిస్తామన్నారు. వేతనాలు పెంపు, ఆరోగ్య బీమా, పింఛన్‌ తదితర సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేస్తున్న సేవలకు వెల కట్టలేమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చెన్నరాజు హట్టిహొళి, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ జి.సి.ప్రకాశ్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలు సునంద తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని