logo

రైల్వే ప్రాజెక్టుల సాధనకు కుమార చర్చలు

కర్ణాటకలో పరిష్కరణకు నోచుకోని రైల్వే ప్రాజెక్టులను కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కోరారు.

Published : 20 Jun 2024 02:28 IST

అశ్విని వైష్ణవ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న కుమార

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కర్ణాటకలో పరిష్కరణకు నోచుకోని రైల్వే ప్రాజెక్టులను కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కోరారు. డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలో రైల్వే మంత్రిని ఆయన బుధవారం కలసి చర్చలు జరిపారు. హెచ్‌డీ దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో బెంగళూరు- సత్యమంగల- చామరాజనగర (కనకపుర-మళవళ్లి మార్గం)లో రైలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారని, దాన్ని త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తమ విన్నపాలను ఆయన సానుకూలంగా స్వీకరించారని కుమార తెలిపారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలసిన కుమారస్వామి కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

అమిత్‌షాతో ముచ్చటిస్తున్న కుమారస్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని