logo

వడగాల్పులకు ఇద్దరు హజ్‌ యాత్రికుల మృతి

మక్కాలో వీచే వేడిగాలులకు బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఆర్‌టీనగర నివాసి కౌసుర్‌ రుక్సాస్‌(69), పులికేశినగర నివాసి మహ్మద్‌ ఇలియాస్‌(50)గా గుర్తించారు.

Updated : 21 Jun 2024 06:14 IST

బెంగళూరు(యశ్వంతపుర): మక్కాలో వీచే వేడిగాలులకు బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఆర్‌టీనగర నివాసి కౌసుర్‌ రుక్సాస్‌(69), పులికేశినగర నివాసి మహ్మద్‌ ఇలియాస్‌(50)గా గుర్తించారు. మక్కాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినా అనే నగరంలో ఇద్దరు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు మక్కాలో అంత్యక్రియలు నిర్వహించి అక్కడి ప్రభుత్వం మృతి ధ్రువీకరణ పత్రాలను ఇస్తుందని హజ్‌ సమితి కార్యనిర్వహణ అధికారి సర్ఫారాజ్‌ ఖాన్‌ తెలిపారు.


అనుమానిత తీవ్రవాది అరెస్టు

బెంగళూరు (శివాజీనగర):  దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఆరోపణలపై కశ్మీరుకు చెందిన ఫిర్దోస్‌ ఖురేషి అనే వ్యక్తిని మాదనాయకనహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పీణ్య ప్లాటినమ్‌ సిటీ అపార్ట్‌మెంట్లోని అతని ఫ్లాట్ నుంచి ల్యాప్‌టాప్, బైకు, చరవాణిని జప్తు చేసుకున్నారు. బెంగళూరులోనే చదువుకుని, బెంగళూరు అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో మార్కెటింగ్‌ విభాగంలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఎక్స్‌ కార్ప్‌ ఖాతా ద్వారా ట్వీట్లు వేయడం, దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నాడని అతన్ని అరెస్టు చేశారు.


తుపాకీ తూటాలకు ఇద్దరి బలి

హాసన: హొయ్సళ నగర లేఅవుట్లో గురువారం మధ్యాహ్నం తుపాకీ చప్పుడుకు స్థానికులు భయపడ్డారు. లేఅవుట్ పరిధిలో విశ్రాంతి కోసం వేసిన సిమెంటు బెంచీ వద్ద ఒక యువకుడు, కారులో మరో యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుల వివరాలను గుర్తించవలసి ఉందని ఎస్పీ మహ్మద్‌ సుజీతా తెలిపారు. మైసూరు రిజిస్ట్రేషన్‌కు చెందిన కారు వద్దకు వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపై కాల్పులు జరపడంతో అతను బెంచి సమీపంలో పడి మరణించాడని గుర్తించారు. మృతుల వివరాలను గుర్తించాల్సి ఉందని మహ్మద్‌ సుజీతా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని