logo

హాసనలో మరో కలకలం.. యువకుడిపై ఎమ్మెల్సీ అత్యాచారం!

‘తనపై లైంగిక దౌర్జన్యం జరిగింది. వద్దన్నా బలవంతంగా లైంగిక క్రియలో ఓ ఎమ్మెల్సీ పాల్గొన్నాడు. అతని వేధింపులు భరించలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అంటూ పోలీసు డైరెక్టర్‌ జనరల్, హాసన జిల్లా ఎస్పీ, ముఖ్యమంత్రి, హోం మంత్రికి కొన్ని ఫిర్యాదులు అందాయి.

Published : 22 Jun 2024 04:56 IST

హాసన: ‘తనపై లైంగిక దౌర్జన్యం జరిగింది. వద్దన్నా బలవంతంగా లైంగిక క్రియలో ఓ ఎమ్మెల్సీ పాల్గొన్నాడు. అతని వేధింపులు భరించలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అంటూ పోలీసు డైరెక్టర్‌ జనరల్, హాసన జిల్లా ఎస్పీ, ముఖ్యమంత్రి, హోం మంత్రికి కొన్ని ఫిర్యాదులు అందాయి. ఈసారి ఫిర్యాదు చేసింది మహిళ కాదు. అరకలగూడుకు చెందిన ఒక జనతాదళ్‌ కార్యకర్త (25)! సుమారు 15 పుటల్లో తనపై జరిగిన దౌర్జన్యానికి సంబంధించి సుదీర్ఘంగా ఆ కార్యకర్త ఆరోపించాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మబలికి, బెదిరించి ఆ విధానపరిషత్‌ సభ్యుడు అత్యాచారం చేశాడని బాధితుడు ఆరోపించాడు. బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని ఎస్పీ మహ్మద్‌ సజీదా తెలిపారు. రూ.5 కోట్లు ఇవ్వాలని ఆ కార్యకర్త డిమాండు చేశాడని, దాన్ని ఖండించినందుకు అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని హొళెనరసీపుర ఠాణాలో ఎమ్మెల్సీకి ఆప్తుడు శివకుమార్‌ శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ, ఆయన సతీమణి భవానీ కేసుల కలకలం హాసన్‌ను కుదిపేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని