logo

పెద్దలసభలో కొత్తవారికి స్వాగతం!

రాష్ట్ర విధానపరిషత్‌కు విధానసభతో పాటు ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి నెగ్గిన 17 మంది నూతన సభ్యులు సోమవారం విధానసౌధలోని బ్యాంక్వెంట్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

Published : 25 Jun 2024 02:55 IST

విధానపరిషత్‌లో ప్రమాణస్వీకారం చేసిన నూతన సభ్యులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,

పరిషత్‌ అధ్యక్షుడు బసవరాజ హొరట్టి, మంత్రి హెచ్‌.కె.పాటిల్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర విధానపరిషత్‌కు విధానసభతో పాటు ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి నెగ్గిన 17 మంది నూతన సభ్యులు సోమవారం విధానసౌధలోని బ్యాంక్వెంట్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. విధానసభ నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యులు ఎన్‌.ఎస్‌.బోసురాజు, డాక్టర్‌ యతీంద్ర సిద్ధరామయ్య, కె.గోవిందదరాజు, ఐవాన్‌ డిసౌజా, జగదేవ్‌ గుత్తేదార్, ఎ.వసంతకుమార్, బల్కిస్‌ బాను, భాజపా సభ్యులు సీటీ రవి, ఎన్‌.రవికుమార్, జేడీఎస్‌ సభ్యుడు టి.ఎన్‌.జవరాయగౌడ చేత పరిషత్‌ అధ్యక్షుడు బసవరాజ హొరట్టి ప్రమాణం చేయించారు. ఈశాన్య పట్టభద్రుల నియోజకవర్గ సభ్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌పాటిల్, బెంగళూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నెగ్గిన రామోజీగౌడ, ఆగ్నేయ ఉపాధ్యాయ నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాస్‌ (అంతా కాంగ్రెస్‌), నైరుతి పట్టభద్రుల నియోజకవర్గం ప్రతినిధి ధనంజయ సార్జి (భాజపా), నైరుతి ఉపాధ్యాయుల నియోజకవర్గంలో నెగ్గిన ఎస్‌.ఎల్‌.బోజేగౌడ (జేడీఎస్‌), దక్షిణ ఉపాధ్యాయుల నియోజకవర్గం విజేత కె.వివేకానంద (జేడీఎస్‌) ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయశాఖ మంత్రి హెచ్‌.కె.పాటిల్‌ తదితరులు నూతన సభ్యులను అభినందించారు.

కార్యక్రమానికి హాజరైన భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర భుజంపై చేయి వేసి మాట్లాడుతున్న సిద్ధరామయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని