logo

కన్నడలో కుమార ప్రమాణం!

హస్తిన వేదికగా కన్నడకు ఓ గుర్తింపు తెచ్చే చిరు ప్రయత్నం చేశారు కొత్తగా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హెచ్‌.డి.కుమారస్వామి! మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన సోమవారం దిల్లీలోని పార్లమెంట్‌ భవన్‌లో లోక్‌సభ సభ్యుడిగా కన్నడలో.. దేవుడిపై ప్రమాణం చేశారు.

Published : 25 Jun 2024 02:57 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హస్తిన వేదికగా కన్నడకు ఓ గుర్తింపు తెచ్చే చిరు ప్రయత్నం చేశారు కొత్తగా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హెచ్‌.డి.కుమారస్వామి! మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన సోమవారం దిల్లీలోని పార్లమెంట్‌ భవన్‌లో లోక్‌సభ సభ్యుడిగా కన్నడలో.. దేవుడిపై ప్రమాణం చేశారు. ఇది మరిచిపోలేని క్షణమని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. 18వ లోక్‌సభ సభ్యుడిగా మండ్య ప్రజల ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. అందరి సమక్షంలో కన్నడలో ప్రమాణస్వీకారం చేయడానికి మండ్య ప్రజలిచ్చిన బలమే కారణమన్నారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, శోభాకరంద్లాజె, వి.సోమణ్ణ తదితరులూ ప్రమాణస్వీకారం చేశారు. సోమణ్ణ సభలోకి ప్రవేశించే వేళ.. తలవంచి.. భవంతికి నమస్సులు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని