logo

జైలు భోజనం తింటే దర్శన్‌కు వాంతట!

తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం ఒంటికి సరిపడడం లేదని, ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ నటుడు దర్శన్‌ వేసుకున్న అర్జీపై విచారణను ఉన్నత న్యాయస్థానం జులై 18కు వాయిదా వేసింది

Updated : 11 Jul 2024 07:53 IST

దర్శన్‌  

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం ఒంటికి సరిపడడం లేదని, ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ నటుడు దర్శన్‌ వేసుకున్న అర్జీపై విచారణను ఉన్నత న్యాయస్థానం జులై 18కు వాయిదా వేసింది. చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఆయన ప్రస్తుతం పరప్పనఅగ్రహార కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండులో కొనసాగుతున్నారు. ఇంటి భోజనం, పరుపు, చదువుకునేందుకు పుస్తకాలు తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని వేసుకున్న అర్జీని జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కారాగారం రూల్‌ బుక్‌లో ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు ఎటువంటి నియమాలు ఉన్నాయని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు అనుమతించారు. కారాగారంలో ఇస్తున్న భోజనం తింటే తనకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని, బరువు కూడా తగ్గిపోతున్నానని దర్శన్‌ ఆక్రోశిస్తూ, తన న్యాయవాదుల సహకారంతో ఉన్నత న్యాయస్థానంలో రిట్ అర్జీ వేసుకున్నారు.

దర్శన్‌ దూరమైతే..

బెంగళూరు (మల్లేశ్వరం): చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు (ఏ1) పవిత్ర గౌడను ఆమె తల్లి బుధవారం కలిసి మాట్లాడారు. హత్యకు కారణం తానే అన్నట్లు దర్శన్‌ ప్రవర్తిస్తున్నాడని, భవిష్యత్తులో అతను తనకు దూరమవుతాడని తన తల్లి వద్ద రోధించినట్లు సమాచారం. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానంలో అర్జీ వేయాలని ఆమె తన తల్లికి సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని