logo

Pavitra Gowda: పవిత్రాగౌడకు అనారోగ్యం

చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్రాగౌడ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను మంగళవారం ఇక్కడ అన్నపూణేశ్వరి నగర పోలీసులు విచారిస్తున్న సమయంలో నీరసించిపోయారు.

Updated : 19 Jun 2024 08:12 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్రాగౌడ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను మంగళవారం ఇక్కడ అన్నపూణేశ్వరి నగర పోలీసులు విచారిస్తున్న సమయంలో నీరసించిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి వైద్యులను రప్పించి సేవలందించారు. అక్కడి నుంచి మల్లత్తహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విచారణ నిలిపివేసి విశ్రాంతి కోసం ఆమెను మహిళా సాంత్వన కేంద్రానికి చేర్చారు. నిత్యం ఉదయమే ఆ కేంద్రం నుంచి ఆమెను ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీ కొనసాగనుంది. ఈ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారణ కోసం మైసూరుకు తీసుకువెళ్లారు. సినీనటుడు దర్శన్‌ మేనేజరు నాగరాజు, కారు డ్రైవర్‌ లక్ష్మణ్‌ను మైసూరుకు తరలించి అక్కడి ఓ హోటల్‌ వద్ద మహజరు (స్థల పరిశీలన) నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని