logo

కాంగ్రెస్‌తో కటీఫ్‌: ఇబ్రహీం

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం

Published : 28 Jan 2022 01:29 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం చెప్పారు. విధానపరిషత్తులో ప్రతిపక్ష నాయకుడి పదవి బీకే హరిప్రసాద్‌కు ఇవ్వడంతో తానెంతో ఆనందించినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, బీకే హరిప్రసాద్‌ ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయని ఎద్దేవా చేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోసమే మాజీ ప్రధాని దేవేెగౌడను కాదని కాంగ్రెస్‌లోకి వచ్ఛా పరిషత్‌ అధ్యక్ష పదవి నాకెందుకు రాలేదో సిద్ధు వెల్లడించాలి’ అని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకే కాదు.. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్‌పీ, జనతాదళ్‌.. ఇలా ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నా ఎటు చేరాలో తేల్చుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ముగిశాక కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు.. లేదా రాష్ట్రపతి పాలనకు దారి తీయవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు