logo

నిబంధనలు మరింత కఠినం

పాజిటివ్‌, క్రియాశీల కేసులు, మరణాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాజిటివిటీ మూడు శాతానికి చేరుకుంటే లాక్‌డౌన్‌ విధించాలని గతంలో ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం

Published : 28 Jan 2022 01:29 IST

కొవిడ్‌ స్వీయ నిర్ధారణ పరీక్ష పరికరం

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : పాజిటివ్‌, క్రియాశీల కేసులు, మరణాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాజిటివిటీ మూడు శాతానికి చేరుకుంటే లాక్‌డౌన్‌ విధించాలని గతంలో ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం పాజిటివిటీ అన్ని చోట్లా 20 శాతం దాటింది. మూడో అలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య నామమాత్రమే. ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణలో మంత్రులు అశోక్‌, సుధాకర్‌, సీనియరు అధికారులు, కొవిడ్‌ సాంకేతిక సలహా సమితి సభ్యులు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. పాజిటివిటీని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కర్ణాటకలో తాజాగా 85 ఒమిక్రాన్‌ కేసులతో కలిపి ఈ కేసుల సంఖ్య 1,115కు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రి కె.సుధాకర్‌ ట్వీటు చేశారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను మూసివేయాలని బెంగళూరు పాలికె, ప్రభుత్వం తీర్మానించాయి. మూడో అల ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు విద్యార్థులకు భౌతిక తరగతుల నిర్వహణకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి భౌతిక తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని విద్యా మంత్రి బి.సి.నాగేశ్‌ ఇప్పటికే ప్రకటించారు.

తాజా కేసులు

కర్ణాటకలో గురువారం 38,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 67,236 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 49 మంది మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 3,28,711కు చేరుకున్నాయి. పాజిటివిటీ 20.44 శాతం, మరణాలు 0.12 శాతంగా నమోదయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన 661 మంది సహా, 828 మంది ప్రయాణికులకు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 1.86 లక్షల మందికి స్వాబ్‌ టెస్టులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 1.61 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

బెంగళూరులో కరోనా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉపకరణాల వితరణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని