logo

పరిషత్‌లో విపక్షనేతగా హరిప్రసాద్‌

రాష్ట్ర విధానపరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడిగా బీకే హరిప్రసాద్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు చీఫ్‌విప్‌గా ప్రకాష్‌ రాథోడ్‌, ఉపనాయకుడిగా గోవిందరాజులును నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 28 Jan 2022 01:29 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర విధానపరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడిగా బీకే హరిప్రసాద్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు చీఫ్‌విప్‌గా ప్రకాష్‌ రాథోడ్‌, ఉపనాయకుడిగా గోవిందరాజులును నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకటి ప్రతిపక్ష నేత ఎస్‌.ఆర్‌.పాటిల్‌కు ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కలేదు. ఆయన పదవీకాలం ముగిసింది. ఆ పదవికి హరిప్రసాద్‌ను ఎంపిక చేశారు. బీకే రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు గుజరాత్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతల్లో కొనసాగారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిపక్ష స్థానంపై కన్నేసి పావులు కదిపిన సీనియర్‌ నేత సి.ఎం.ఇబ్రహీంకు నిరాశ మిగిలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు