logo

మరోసారి.. మేకెదాటు పాదయాత్ర

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు సడలించడంతోపాటు కేసుల సంఖ్య తక్కువ కావడంతో మరోసారి మేకెదాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో

Published : 28 Jan 2022 01:29 IST

పెరంబదూరుకు సైకిల్‌యాత్ర సాగించిన కార్యకర్తలకు

ప్రశంసాపత్రాలు అందించిన డీకే శివకుమార్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు సడలించడంతోపాటు కేసుల సంఖ్య తక్కువ కావడంతో మరోసారి మేకెదాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న రాజీవ్‌గాంధీ స్మారకం వరకు సైకిల్‌ యాత్ర సాగించిన యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన గురువారం బెంగళూరులో ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మేకెదాటు పాదయాత్ర ఇదివరకు ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. వందలాది మంది సమక్షంలో గుర్రాల పోటీలు నిర్వహించిన సమయంలో కరోనా నిబంధనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భాజపా శాసనసభ్యులు జాతరలు చేస్తే అడిగే వారే లేరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని