logo

రామసాగరలో నాజూకు తరగతి గది

తాలూకాలోని రామసాగర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నాజూకు తరగతి గది (స్మార్ట్‌ క్లాస్‌) సిద్ధమైంది. పాఠశాల అభివృద్ధి సమితి సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర దాతల సహకారంతో స్మార్ట్‌ క్లాస్‌ను రూపొందించారు.

Published : 28 Jan 2022 01:29 IST

రామసాగర ప్రభుత్వ పాఠశాలలో బస్సు ఆకారంలో నాజూకు తరగతి గది

కంప్లి, న్యూస్‌టుడే: తాలూకాలోని రామసాగర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నాజూకు తరగతి గది (స్మార్ట్‌ క్లాస్‌) సిద్ధమైంది. పాఠశాల అభివృద్ధి సమితి సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర దాతల సహకారంతో స్మార్ట్‌ క్లాస్‌ను రూపొందించారు. దీన్ని బస్సు ఆకారంలో రూపొందించి ‘కల్యాణ కర్ణాటక శిక్షణ సారిగె’గా నామకరణం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాల మరికొన్ని రోజుల్లో వందేళ్లు పూర్తి చేసుకోనుంది. 1923లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 602 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని