logo

ప్రగతికి ఊతమిచ్చిన రాజీవ్‌

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఇక్కడ కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్‌ చిత్ర పటానికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పుష్పార్చన చేసి ప్రసంగించారు.

Published : 22 May 2022 01:55 IST

రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పుష్పార్చన చేస్తున్న మల్లికార్జున ఖర్గే

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఇక్కడ కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్‌ చిత్ర పటానికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పుష్పార్చన చేసి ప్రసంగించారు. దేశంలో ఆధునిక సాంకేతిక యుగానికి ఆయన బాటలు వేశారని గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించారని ప్రస్తుతించారు. ఐటీ, బీటీ రంగం ఉజ్వల భవితకు పునాది వేసిన ఘనత రాజీవ్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేశారని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి మళ్లించారని వివరించారు. నేటి భాజపా పాలకులు దేశ సంపదను బహుళ జాతి సంస్థలకు విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను కట్టడి చేసేందుకు ఎలాంటి పథకాలూ నేడు కానరావన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యాధ్యక్షులు రామలింగారెడ్డి, సలీం అహ్మద్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని