logo

అయ్యప్పకు నెయ్యాభిషేకం

స్థానిక రాఘవేంద్రకాలనీలో నిర్మించిన శబరి అయ్యప్ప ఆలయంలో 9వ వార్షికోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్యకైంకర్యాలు నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో అభిషేకించారు.

Published : 22 May 2022 01:55 IST

హోమంలో పాల్గొన్న ఆలయ కమిటీ ప్రముఖులు, భక్తులు

బళ్లారి గ్రామీణ: స్థానిక రాఘవేంద్రకాలనీలో నిర్మించిన శబరి అయ్యప్ప ఆలయంలో 9వ వార్షికోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్యకైంకర్యాలు నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో అభిషేకించారు. అష్టద్రవ్యాలు, పంచామృతం, నెయ్యాభిషేకం చేశారు. పుష్పాలతో పుష్పాభిషేకం ప్రత్యేకంగా చేపట్టారు. గణపతి, నవగ్రహ, రుద్రహోమాలు చేశారు. స్వామిని, గణపతిని, నాగరాజప్రభును పుష్పాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులందరికీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త జయంతి జయప్రకాష్‌ గుప్త, వినోద్‌, నాగరాజు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని