logo

Khammam: అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి

రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షల ఇవ్వాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Published : 18 Jun 2024 16:20 IST

కామేపల్లి: రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షల ఇవ్వాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సీడీపీవో కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలో కామేపల్లిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగనవాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్ కొరకు పోరాటం చేస్తే కేవలం టీచర్‌కు లక్ష రూపాయలు, ఆయాకు 50 వేల ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 18 వేల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటియుసి). మేరీ, ఆదిలక్ష్మి, లక్ష్మీమని, ఝాన్సీ, అనసూర్య, లక్ష్మి, మరియమ్మ, బసవమ్మ, అమృత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని