logo

భట్టి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం పురస్కరించుకొని చింతకాని మండలం నాగులవంచలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Published : 15 Jun 2024 13:52 IST

చింతకాని: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం పురస్కరించుకొని చింతకాని మండలం నాగులవంచలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్త దానం చేశారు. ఈ కార్యక్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంభం వీరభద్రం, నెల్లూరు కోటేశ్వరరావు, మడుపల్లి భాస్కర్, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున,  కొప్పుల గోవిందరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని