logo

Kammam: ఉపాధ్యాయునికి దేహ శుద్ధి

ఉపాధ్యాయుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతన్ని గ్రామస్తులు చెట్టు కట్టేసి కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది.

Updated : 18 Jun 2024 16:36 IST

అశ్వరావుపేట గ్రామీణం: ఉపాధ్యాయుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతన్ని గ్రామస్తులు చెట్టు కట్టేసి కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తె.. మండలంలోని నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో లావుడియా రాందాస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని వివాహిత కుటుంబీకులు పాఠశాలకు విధులకు వచ్చిన రామ్ దాస్‌ను చితకబాది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఆ మహిళను కూడా కుటుంబీకులు గ్రామస్తులు చితక బాధారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వరావుపేట పోలీసులు గ్రామానికి వెళ్లి ఉపాధ్యాయుడు రాందాస్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని