logo

వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని మండల పరిధిలోని తాళ్ల గూడెం గ్రామంలోని రైతులు గ్రామ దేవతలు బొడ్రాయి, ముత్యాలమ్మకు  జలాభిషేకాలు నిర్వహించారు.

Published : 17 Jun 2024 13:49 IST

కామేపల్లి : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని మండల పరిధిలోని తాళ్ల గూడెం గ్రామంలోని రైతులు గ్రామ దేవతలు బొడ్రాయి, ముత్యాలమ్మకు  జలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము దుక్కి దున్ని విత్తనాలు నాటామని, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో విత్తనాలు మొలకెత్తవని తెలిపారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు పుష్కలంగా కురిస్తే పంటలు పండుతాయని,  గ్రామంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు చిన్న కోటయ్య, నూతలపాటి నాగేశ్వరరావు, నరేష్, పుచ్చకాయల ప్రభాకర్, అంగడాల అనంత రాములు, కొమ్మిన బోయిన రాజు, వెంకటేశ్వర్లు ,నాగేశ్వరరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు