logo

Khammam: అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్ పేటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ రేసు వెంకయ్యకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Updated : 17 Jun 2024 21:05 IST

ఏన్కూర్: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్ పేటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ రేసు వెంకయ్యకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కూతురు పెళ్లి కోసం ఇంట్లో దాచుకున్న రూ. రెండు లక్షల నగదు కాలిపోయింది. ఇంట్లో సామాగ్రితో పాటు వ్యవసాయ పరికరాలు బూడిద పాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్  ఆ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంకయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు,  కాంగ్రెస్ నాయకులు వేముల కృష్ణ ప్రసాద్, స్వర్ణ నరేందర్, మేడా ధర్మారావు, జి. సత్యనారాయణ, సీతారాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని