logo

Khammam: అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం టీఎల్ పేటలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద బాధితులకు దాతలు రూ.1.12 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Updated : 17 Jun 2024 21:04 IST

ఏన్కూర్: ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం టీఎల్ పేటలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద బాధితులకు దాతలు రూ.1.12 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆ మొత్తాన్ని దాతలు సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. వారం క్రితం ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రేసు వెంకయ్య, వారి బంధువుల నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు పర్యాయాలు గ్రామానికి సర్పంచిగా చేసి నిజాయతీ గల వ్యక్తిగా గుర్తింపు పొందిన రేసు వెంకయ్య పరిస్థితి గమనించి దాతలు స్పందించారు. ఆ గ్రామంలో పెద్దలు విరాళాలు సేకరించి రూ. 90 వేలు అందించారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగ, సాంస్కృతిక సంఘాలు మరో రూ. 22 వేలు అందజేశాయి. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, సొసైటీ మాజీ ఛైర్మన్ ఎండ్రాతి పుల్లయ్య, మాజీ సర్పంచి వర్షా రాంబాబు, ఆదివాసీ ఉద్యోగ సాంస్కృతిక సంఘం ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వర్ష లక్ష్మణ్, ఆదివాసీ పెద్దలు  నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని