logo

మైనర్ల డ్రైవింగ్‌.. 50 వాహనాలు స్వాధీనం

రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మైనర్ల డ్రైవింగ్‌పై దృష్టిపెట్టినట్లు ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. సీపీ సునీల్‌దత్‌ ఆదేశాలతో నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

Published : 17 Jun 2024 02:24 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మైనర్ల డ్రైవింగ్‌పై దృష్టిపెట్టినట్లు ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. సీపీ సునీల్‌దత్‌ ఆదేశాలతో నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. బాలలు నడుపుతున్న 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. విద్యార్థులు, మైనర్లు ద్విచక్రవాహనాలు, కార్లు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. పట్టుబడిన బాలలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్‌చేసి, తల్లిదండ్రులనూ న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. సీఐ మోహన్‌రావు, ఎస్‌ఐ సాగర్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని