logo

కొత్తగూడెం కలెక్టర్‌ ఔదార్యం

రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఔదార్యం చాటుకున్నారు.

Published : 17 Jun 2024 02:38 IST

తన వాహనంలో ఆసుపత్రికి క్షతగాత్రుడి తరలింపు

బూర్గంపాడు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఔదార్యం చాటుకున్నారు. జిల్లా నూతన కలెక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం భద్రాచలం పర్యటనకు వచ్చారు. ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కొత్తగూడెం తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొత్తూరు నారాయణపురం గ్రామానికి చెందిన నలుగురు పాల్వంచ నుంచి ఆటోలో భద్రాచలం వైపునకు వస్తున్నారు. మణుగూరు అడ్డరోడ్డు దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలతో రహదారిపై పడిపోయాడు. అదేమార్గంలో వెళ్తున్న కలెక్టర్‌ ఘటనను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అంబులెన్స్‌లోకి ఎక్కించేందుకు సహాయపడ్డారు. 108 వాహనంలో మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ఔదార్యం చాటుకున్న కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని